అమెరికాలో ఆంధ్ర స్త్రీ మృతి
ఒంగోలు:ఆంధ్రకు చెందిన ఓ వివాహిత అమెరికాలో అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. భర్త వేధింపులు తట్టుకోలేకే ఆమె మరణిచినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతురాలిని ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు గ్రామానికి చెందిన సుభాషిణిగా గుర్తించారు.
ఆమెకు నిరుడు ఫిబ్రవరిలో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడిన రమాక్రాంతితో వివాహమైంది. అయితే పెళ్లయినప్పటినుంచి ఆమెకు భర్త వేధింపులు తప్పలేదు. దీనిపై పలు పర్యాయాలు తల్లిదండ్రులకు కూడా తెలిపింది. రెండు రోజుల క్రితం కూడా తల్లిదండ్రులకు తన బాధల గురించి చెప్పుకున్న ఆమె అకస్మాత్తుగా మరణించినట్టు కుటుంబసభ్యులకు సమాచారం అందింది.












Click it and Unblock the Notifications