ఉద్యమం వదలం, కాంగ్రెస్ ను వీడం: ఎమ్మెస్

M Satyanarayana Rao
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణా కోసం సీనియర్ నేతలతో కలసి ఉద్యమిస్తున్నప్పటికీ, పార్టీని వీడి వెళ్లేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్మెస్ స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణాపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణాలో అభివృద్ధి చక్కగా సాగుతున్నప్పటికీ, సెంటిమెంట్ బలంగా పనిచేయగలదన్నారు. ప్రస్తుతం తెరాస ప్రజాప్రతినిధుల రాజీనామాలతో ఆ సెంటిమెంట్ మరింత బలపడిందన్నారు.

తెరాస ప్రజాప్రతినిధులు రాజీనామాల కారణంగా ఉపఎన్నికలు జరిగితే ఆ పార్టీయే గెలుపొందుతుందని జోస్యం చెప్పారు. భువనగిరిలో తెలంగాణా సీనియర్ల సభకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ఎమ్మెస్ అక్కడ ఏం మాట్లాడుతారో చెప్పాలని మాత్రమే తాను ప్రశ్నించానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+