తిరుపతి యువతిపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్: ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చిన తిరుపతికి చెందిన ఒక అమ్మాయిపై శనివారం రాత్రి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి తిరుపతి నుంచి వచ్చిన సౌమ్య అనే యువతి ఇమ్లీబన్ బస్ స్టేషనులో దిగింది. తన స్నేహితురాలు ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది.
కొంత దూరం వెళ్లిన తర్వాత ఆటోలో మరో ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. రాజేంద్ర నగర్ లోని సన్ సిటీలోని ఒక ఇంటికి సౌమ్యను తీసికెళ్లి ఆమెపై ఆ నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చారు. సౌమ్య ప్రస్తుతం నయాపూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications
