అయేషా కేసు: హైదరాబాదుకు లడ్డూ
విజయవాడ: విజయవాడలో జరిగిన విద్యార్థిని అయేషా హత్య కేసులో నిందితుడైన గుర్విందర్ సింగ్ ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఒక కేసులో రాజమండ్రి జైలులో శిక్ష అనుభవిస్తున్న అతన్ని విజయవాడ పోలీసులు తమ కస్టడీకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. అతనికి హైదరాబాదులో ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తారు. కోర్టు ఆదేశాల మేరకు గుర్విందర్ సింగ్ ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
గుర్విందర్ సింగ్ ను మీడియా కంట పడకుండా ఎస్కార్టుతో వాహనంలో పోలీసులు హైదరాబాదు తరలించారు. అయేషా హత్య కేసు చిక్కుముడి విప్పడంలో విజయవాడ పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో మంత్రి కోనేరు రంగారావు బంధువుల పాత్ర ఉందని అయేషా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications
