మంత్రులపై పురుషోత్తమ రెడ్డి గుర్రు

హైదరాబాద్: తమపై విమర్శలు చేస్తున్న మంత్రులను కట్టడి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిదేనని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి సభ విజయవంతమైతే మంత్రులు రాజీనామా చేయాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ నెల 24వ తేదీన తలపెట్టిన భువనగిరి సభ తర్వాత తామేమిటో తెలిసి వస్తుందని ఆయన అన్నారు.

భువనగిరి సభ విజయవంతమైనంత మాత్రాన పురుషోత్తమరెడ్డి హీరో కాలేరని నల్లగొండ కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత పురుషోత్తమరెడ్డికి లేదని ఆయన అన్నారు. పురుషోత్తమరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయినా నష్టం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాల వల్ల జరిగే ఉప ఎన్నికల ఫలితాలు రెఫరెండం కాదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి విశాఖపట్నంలో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+