చిరుతను బంధించిన అధికారులు
రాజమండ్రి: రాజమండ్రిలోని లలితానగర్ లో సంచలనం సృష్టించిన చిరుతను ఎట్టకేలకు అటవీ శాఖాధికారులు, జంతుప్రదర్శన శాల అధికారులు కలిసి బంధించారు. చిరుత సత్యనారాయణ అనే వడ్రంగి ఇంటిలోని స్నానాల గదిలో ప్రవేశించింది. అది చూసి సత్యనారాయణ స్నానాల గది తలుపులు పెట్టి విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. దాంతో అధికారులు రంగప్రవేశం చేసి చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు.
విశాఖపట్నం నుంచి వైద్యులను రప్పించారు. వారు చిరుతకు మత్తుమందు ఇచ్చారు. దీంతో అది స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే అధికారులు దాన్ని బంధించారు. బందీ చేసిన చిరుతను విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు తరలించారు. దీంతో లలితానగర్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. గోకవరం అడవుల్లోంచి చిరుత రాజమండ్రిలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
