రాజమండ్రిలో చిరుత సంచలనం
రాజమండ్రి: రాజమండ్రి జనావాసంలో చిరుతపులి సంచారం తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక వ్యక్తి తన ఇంటిలోని బాత్రూంలో చిరుతపులి దూరడాన్ని గమనించి బయటనుంచి గొళ్లెం పెట్టాడు. వెంటనే అధికారులకు విషయం తెలియజేశాడు. వెంటనే పోలీసులు, అటవీ శాఖాధికారులు రంగప్రవేశం చేసి చిరుతను బోనులో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిరుత గోకవరం అటవీ ప్రాంతం నుంచి రాజమండ్రిలోకి వచ్చినట్లు సమాచారం.
రాజమండ్రిలోకి ప్రవేశించిన చిరుతపులి మనుషులకు ఏ విధమైన హానీ చేయలేదు. చిరుతను చూసేందుకు పెద్ద యెత్తున జనం తరలివచ్చారు. చిరుతను బంధించేందుకు అధికారులు బోనును తెచ్చారు. అయితే బాత్రూం తలుపు వద్ద దాన్ని పెట్టి చిరుతను బంధించడానికి వీలు కావడం లేదు. బాత్రూంకు వెళ్లే దారి చాలా ఇరుకుగా ఉండి బోను పట్టడం లేదు.












Click it and Unblock the Notifications
