అమ్మాయి చేతులు నరికిన ప్రేమోన్మాది
మహబూబ్ నగర్: ఒక ప్రేమోన్మాది ఒక అమ్మాయి చేతులు నరికిన దారుణ సంఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదనే కోపంతో అతను అమ్మాయిపై, ఆమె తమ్ముడిపై తల్వార్లతో దాడి చేశాడు. లక్ష్మి అనే అమ్మాయి తన తమ్ముడు బాబుతో చదువు కోసం మహబూబ్ నగర్ వచ్చింది. ఆమె రియాసత్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లో కిరాయికి ఉండసాగింది. తనను ప్రేమించానని లక్ష్మిని రియాసత్ ఖాన్ వేధించసాగాడు. ఆ వేధింపులు భరించలేక ఆమె అక్కడి నుంచి తన మకాం రాజేంద్రనగరులోకి మార్చింది.
ఇల్లు మారిన తర్వాత కూడా అతను వేధించడం ఆపలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తమ్ముడితో కలిసి ఆటోలో బయలుదేరింది. విషయం తెసుకున్న రియాసత్ తన అనుచరులతో కలిసి ఆమెపై దాడికి దిగాడు. తల్వార్లతో దాడి చేసి లక్ష్మి చేతిలు నరికాడు. బాబు కడుపులో గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications
