వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటగిరికి మద్దతుగా టిడిపికి రాజీనామాలు

By Staff
|
Google Oneindia TeluguNews

ఏలూరు: తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావును బహిష్కరించినందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో నిరసన వ్యక్తమవుతోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు కోటగిరి విద్యాధరరావును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బహిష్కరించారు. విద్యాధరరావుకు మద్దతుగా తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ముగ్గురు తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు ప్రకటించారు. భీమవరం మాజీ శాసనసభ్యుడు నరసింహరాజు, పోలవరం మాజీ శాసనసభ్యుడు వంకా శ్రీనివాసరావు, పెనుకొండ మాజీ శాసనసభ్యుడు కె.వి. రాఘవేంద్ర రావు తెలుగుదేశం పార్టీకి వీడ్కోలు పలికేందుకు సిద్ధపడ్డారు.

వారి బాటలోనే తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యుడు పసల కనకసుందరరావు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. వందలాది మంది కార్యకర్తలు కోటగిరి విద్యాధరరావుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. చింతలపూడి శాసనసభా నియోజకవర్గానికి చెందినవారే కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందినవారు కూడా విద్యాధరరావుకు అండగా నిలుస్తున్నారు. రాజీనామా చేసినవారు చిరంజీవి పెట్టబోయే పార్టీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి పార్టీలో చేరాలని కోటగిరి విద్యాధరరావు ఇది వరకే నిర్ణయం తీసుకున్నారని, దీనివల్లనే ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై బహిరంగ విమర్శలకు దిగారని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X