దర్శకుడు ఉదయశంకర్ కు బెయిలు
రాజమండ్రి: తెలుగు సినిమా హీరో రవితేజ డూప్ మహేందర్ మృతి కేసులో దర్శకుడు ఉదయశంకర్ ను తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆయనను రంపచోడవరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఉదయశంకర్ బెయిలుపై విడుదలయ్యారు. సినిమా షూటింగ్ సందర్భంగా ఇటీవల గోదావరిలో పడి మహేందర్ మరణించిన విషయం తెలిసిందే.
సురేష్ ప్రొడక్షన్స్ పై నిర్మాణమవుతున్న సినిమా షూటింగు గోదావరి నదీ తీరంలో జరుగుతుండగా మహేందర్ ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించాడు. హీరోయిన్ అనుష్క తోసేయడం వల్లనే మహేందర్ గోదావరిలో పడిపోయినట్లు కూడా ఆరోపణలు వినవచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
