వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమస్యలను అవకాశంగా మల్చుకుంకుంటే విజయం: రాహుల్

కర్ణాటక పర్యటనలో భాగంగా బుధవారం రాహుల్ మంగళూరులోని టి.ఎం.ఎ.పే కన్వెన్షన్ కేంద్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1800 మంది విద్యార్ధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన రాహుల్ దేశ భవిష్యత్‌కు యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు.
దేశం అభివృద్ధి సాధించాలంటే ప్రజల మధ్య ఐక్యమత్యం అవసరమని ఆయన ఉద్భోదించారు. భారత్, పాకిస్థాన్‌లు ఒకేసమయంలో స్వాతంత్ర్యం సంపాధించినా పాక్ ప్రజల్లో ఐక్యమత్యం లేకపోవడం వల్లనే వారు అభివృద్థిలో భారత్‌కన్నా వెనుకబడ్డారని రాహుల్ పేర్కొన్నారు.
అలాగే దేశానికి సమస్యలు ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరు భారతీయునిగా ఆలోచించాలే తప్ప కులం, మతం ప్రాతిపాదికన ఆలోచించరాదని ఆయన సందేశమిచ్చారు.
Comments
Story first published: Thursday, March 27, 2008, 11:12 [IST]