విజయవాడ పోలీసు కమిషనర్ బదిలీ
విజయవాడ: విజయవాడ నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ బదిలీ అయ్యారు. నగర కొత్త కమిషనర్ గా వి ఆర్ ఎన్ రెడ్డి ని నియమించారు. సివి ఆనంద్ ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా బదిలీ చేశారు.
విజయవాడ నగర పోలీసు కమిషనర్ గా నిజాయితీతో పని చేసి మంచి పేరు తెచ్చుకున్న సివి ఆనంద్ బదిలీ నగర పౌరులకు బాధ కలిగించింది. బీ ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా హత్య కేసులో రాజకీయ వత్తిళ్ళు తట్టుకోలేక కమిషనర్ ఆనంద్ బదిలీకి దరఖాస్తు చేసుకున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications
