ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
కడప: కడప జిల్లా రాజంపేటలో ఇంజనీరింగ్ విద్యార్థి రైలు పట్టాల కింద పడి గురువారంనాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రొద్దుటూరులోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన నవీన్ అనే విద్యార్థి ప్రిన్సిపాల్ వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలియజేశారు. వారికి కడప జిల్లాలోని పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. పోలీసులు నచ్చజెప్పినా వారు వినలేదు. దీంతో పోలీసులు ప్రిన్సిపాల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
బి.టెక్. మూడో సంవత్సరం చదువుతున్న నవీన్ ప్రిన్సిపాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ అతన్ని మందలించాడు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది. దానికి మనస్తాపం చెందిన నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నవీన్ ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలేమైనా ఉండవచ్చుననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications