కింగ్ ఫిషర్ విమానానికి తప్పిన ముప్పు
హైదరాబాద్: కింగ్ ఫిషర్ విమానానికి గురువారం పైలట్ సమయస్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పింది. విమానంలో ప్రయాణిస్తున్న 97 మంది సురక్షితంగా బయటపడ్డారు. గురువారం ఉదయం ఏడున్నర గంటలకు హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి కింగ్ ఫిషర్ విమానం బయలుదేరింది. కొద్ది సేపటికే ఆ విమానం తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. ప్రయాణికులను మరో కింగ్ ఫిషర్ విమానంలో తొమ్మిదిన్నర గంటలకు ఢిల్లీకి పంపారు.
విమానంలో యాసిడ్ బాటిల్స్ పేలడం వల్లనే విమానాన్ని తిరిగి పైలట్ శంషాబాద్ విమానాశ్రయంలో దించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంధనానికి సంబంధించిన చిన్నపాటి సాంకేతిక సమస్య తలెత్తిందని, అది ఎప్పుడైనా సమస్య తేవచ్చునని భావించి పైలట్ విమానాన్ని తిరిగి శంషాబాదులో దించారని అధికారులు అంటున్నారు. దీనిపై దర్యాప్తునకు ఒక ప్రత్యేక బృందం బయలుదేరింది.












Click it and Unblock the Notifications