పోలిట్ బ్యూరో భర్త, కేంద్రకమిటీలో భార్య

అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ పోలిట్ బ్యూరో సభ్యులుగా ప్రకాశ్ కారత్, వి.ఎస్. అచ్యుతానంద్, ఎస్. రామచంద్రన్ పిళ్లై, సీతారాం ఏచూరి, ఎం.కె. పాండే, బిమన్ బస్, మాణిక్ సర్కార్, పినరాయి విజయన్, బుద్ధదేవ్ భట్టాచార్య, కె. వరదరాజన్, రాఘవులు, బృందా కారత్, మొహమ్మద్ అమిన్, నిరుపమ్ సేన్, కొడియేరి బాలకృష్ణన్ ఎన్నికయ్యారు. నూత స్వేచ్చా ఆర్థిక విధానాలపై, మతతత్వ శక్తులపై పోరాడాలని సిపియం మహాసభ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు భారత్ జూనియర్ భాగస్వామిగా కావడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎకు, బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తామని సిపియం ప్రధాన కార్యదర్శి కారత్ చెప్పారు. ప్రస్తుతం వామపక్ష, ప్రజాతంత్ర కూటమిని ఏర్పాటు చేస్తామని, తదుపరి తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications