చంద్రబాబు పార్టీలో లుకలుకలు: రోశయ్య

తాము భూములు అమ్మి బడ్జెట్టు లోటును భర్తీ చేసుకుంటున్నామనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. భూముల అమ్మకానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వమే జీవో ఇచ్చిందని ఆయన అన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం విషయంలో ఆత్మను చంపుకుని చంద్రబాబు పాలన చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతన లేదని, చంద్రబాబుది మోసపూరిత రాజకీయమని ఆయన విమర్శించారు. శ్రీకృష్ణుని పాత్ర వేసి బఫూన్ పాట ఎలా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications