నెల్లూరు దర్గాలో రెహ్మాన్ ప్రార్థనలు

నెల్లూరు: సినీ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మాన్ శుక్రవారంనాడు నెల్లూరు జిల్లాలోని మస్తానయ్య దర్గాను సందర్శించారు. మస్తానయ్య దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కడప, గుల్బర్గా దర్గాలను సందర్శించడం ఆయన సంప్రదాయంగా పెట్టుకున్నారు. మస్తానయ్య దర్గా వద్ద భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
దర్గాల సందర్శన వల్ల మనశ్శాంతి చేకూరుతుందని ఆయన అన్నారు. నెల్లూరు మస్తానయ్య దర్గాను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications