జనశక్తి అగ్రనేత అమర్ అరెస్టు

కరీంనగర్: జనశక్తి అగ్రనేత అమర్ అలియాస్ కూర దేవేందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయన అరెస్టును పోలీసులు ధృవీకరించడం లేదు. పూణేలోని జనావాసాల్లో ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆయనను కరీంనగర్ తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వంతో నక్సలైట్లు జరిపిన చర్చల్లో ఆయన నక్సల్స్ ప్రతినిధిగా పాల్గొన్నారు.

కూర దేవేందర్ పై 11 జిల్లాల్లో 12 కేసులున్నట్లు సమాచారం. ఇందులో హత్య కేసులు, హత్యాప్రయత్నం కేసులున్నట్లు తెలుస్తోంది. కోవర్టు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అమర్ ను అరెస్టు చేశారని అంటున్నారు. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వేములవాడ. పోలవరం ప్రాజెక్టు వద్ద పార్టీ నిధుల కోసం రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అమర్ విచారణలో అంగీకరించినట్లు చెబుతున్నారు. ఆ మధ్య అరెస్టయిన జనశక్తి కేంద్ర కమిటీ నాయకుడు కూర రాజన్నకు అమర్ సోదరుడు. అమర్ పలు విప్లవ గేయాలు కూడా రాశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+