సికింద్రాబాద్, ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలో తాజాగా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. జాల్నా - బెంగళూరులోని యలహంక మధ్య ఇవి అందుబాటులోకి రానున్నాయి. మొదటి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 28వ తేదీన పట్టాలెక్కనుంది. జులై చివరి వారం వరకూ రాకపోకలు సాగిస్తుంది. ఏపీ, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. వీటికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడయ్యాయి. అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కూడా ఆరంభమైంది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ రూట్ లో దీన్ని నడిపించనున్నారు.

SC Railways to run Special Trains From Jalna to Bengaluru Yelahanka to Clear passengers rush June 28

ఈ నెల 28 నుంచి జూలై 26వ తేదీ వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 7: 20 నిమిషాలకు జాల్నా నుంచి బయలుదేరే నంబర్ 07601 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 9:30 గంటలకు యలహంకకు చేరుకుంటుంది.

ఈ నెల 29 నుంచి జూలై 27వ తేదీ వరకు ప్రతి సోమవారం రాత్రి 11:30 గంటలకు యలహంక నుంచి బయలుదేరే నంబర్ 07602 ప్రత్యేక రైలు రెండో రోజు అంటే బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు జాల్నాకు చేరుకుంటుంది.

పార్తూర్, సేలు, పర్భణీ, పూర్ణ, నాందెడ్, ముద్ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, గౌరిబిదనూరు, దొడ్డబళ్లాపుర మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఏసీ త్రీ-టయర్, స్లీపర్ క్లాస్‌, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

ఈ తాజా నిర్ణయం సికింద్రాబాద్, బెంగళూరు మార్గంలో రద్దీని గణనీయంగా తగ్గించనుంది. నిజామాబాద్, అనంతపురం, రాయచూర్ వంటి ప్రాంతాల ప్రయాణికులకు సైతం అనుకూలమైన కనెక్టివిటీ లభిస్తుంది. మహారాష్ట్రతో పాటు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రయాణికులకు నెల రోజుల పాటు ఈ ఎక్స్ ప్రెస్ అందుబాటులో ఉండబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+