శ్రీలంకలో మంత్రి సహా 12మంది మృతి
కొలంబో: శ్రీలంకలో ఆదివారం ఉదయం జరిగిన ఓ బాంబు పేలుడు ఘటనలో ఆ దేశ జాతీయ రహాదారులశాఖ మంత్రి జయరాజ్‌ఫెర్నాండోపులే మృతి చెందారు. ఈ ఘటనలో మంత్రితో సహా 12 మంది కూడా మరణించారు. దాదాపు 90 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలంక జాతీయ భద్రతా దళానికి చెందిన మీడియా సెంటర్ డైరక్టర్ జనరల్ లక్ష్మణ్ హులుగల్లా బాంబు పేలుడులో మంత్రి మరణించిన విషయాన్ని దృవీకరించారు.
శ్రీలంక రాజధాని కొలొంబోకు 30 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ జిల్లా ప్రాంతమైన గంఫాహా ప్రాంతంలో ఈ బాంబు పేలుడు జరిగిందని ఆయన చెప్పారు. శ్రీలంక సంప్రదాయబద్దమైన నూతన సంవత్సరం ఉత్సవాల్లో భాగంగా తలపెట్టిన మారథాన్ రేసును ప్రారంభించడానికి వెళ్తుండగా మంత్రిపై ఆత్మాహుతి దాడి జరిగింది. తమిళ భాష మాట్లాడే మంత్రిపై ఎల్టీటీఇ తీవ్రవాదులే దాడి చేశారని సైనికాధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications