కిషన్ రెడ్డి, రామ్మోహన్ కు కొత్త శాఖలు- తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్.. అవుట్..!?
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే మంత్రుల మార్పులు.. చేర్పుల పైన సుదీర్ఘ కసరత్తు చేసారు. కొందరు సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల విషయంలోనూ మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. శాఖలు మారటంతో పాటుగా కొత్తగా ఇద్దరికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.
ప్రధాని మోదీ తన కేబినెట్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు నిర్ణయించారు. దీంతో, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రివర్గం లోకి ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రధాని ముఖ్య కార్యదర్శి శక్తి కాంత దాస్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శాఖ మారుస్తారని చెబుతున్నారు. ఆమెకు విద్యాశాఖ కేటాయించనున్నట్లు సమాచారం. విద్యాశాఖ చూస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ ను కేబినెట్ నుంచి తప్పించటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు శాఖలు మారనున్నాయి. కిషన్ రెడ్డికి గతంలో జైపాల్ రెడ్డి నిర్వహించిన పట్టణాభివృద్ధి శాఖ కేటాయిస్తున్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల పై బీజేపీ కొత్త స్కెచ్
అదే విధంగా రామ్మోహన్ నాయుడును విమానయాన శాఖ తప్పించి మరో శాఖ ఇచ్చే విధంగా కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. ఇక.. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. బండి సంజయ్ మంత్రి పదవి పైన చర్చ సాగుతున్నా..ఆయన కొనసాగటం దాదాపు ఖాయమైంది. ఇక.. ఏపీ నుంచి మంత్రి పెమ్మసానికి ప్రమోషన్ దక్కనుందని తెలుస్తోంది. కొత్తగా మరో మంత్రి కేబినెట్ లో అవకాశం కల్పించారు. జనసేన కు మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. జనసేన ముందుకు రాకుంటే టీడీపీ నుంచి ఎస్సీ వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు, బీజేపీ నుంచి సీఎం రమేశ్ పేర్ల పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కాగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. దీంతో.. కేంద్ర కేబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications