నవ్వకుండా ఉండలేరన్న సీఎం చంద్రబాబు.. చిన్నారి వీడియో వైరల్ !
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఐఏఎస్ అధికారిగా ఓ చిన్నారితో చేసిన సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబానికి చెందిన చిన్నారి గింజుపల్లి ఆర్నా నటించిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకోవడమే కాకుండా, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టిని కూడా ఆకర్షించింది. వీడియో చూసిన సీఎం స్వయంగా స్పందించి ప్రశంసించడంతో ఈ చిన్నారి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో నివసిస్తున్న ఆర్నా కుటుంబం, ఆమె కోసం 'Arna's World' పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తోంది. చిన్నారి అమాయకత్వం, సృజనాత్మక వీడియోలు, AI టెక్నాలజీతో రూపొందించిన వినూత్న కంటెంట్‌ను తరచూ అందులో పోస్టు చేస్తుంటారు. తాజాగా పోస్టు చేసిన వీడియో మాత్రం లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది.

ఈ వైరల్ వీడియోలో ఆర్నా.. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ కుర్చీలో కూర్చొని ఉన్నట్లుగా చూపించారు. ఎదుట పెద్ద స్క్రీన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టుగా AI ద్వారా అద్భుతంగా రూపొందించారు. అదే సమయంలో కిటికీ బయట తన తండ్రి నిలబడి కనిపిస్తున్న సన్నివేశాన్ని కూడా ఎంతో సహజంగా చిత్రీకరించారు.
ఈ వీడియోకు 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరో వెంకటేష్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో జత చేశారు. "నేను ఐఏఎస్ పాసై... వైజాగ్ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ కుర్చీలో కూర్చొని చంద్రబాబు గారితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు... కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తారు. వెంటనే 'చంద్రబాబూ... బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు' అని చెప్పేసి బయటకు వచ్చి నాన్న కాళ్లపై పడతాను" అనే డైలాగ్‌తో వీడియో మరింత ఆకట్టుకుంటుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దానిని వీక్షించి స్పందించారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వీడియోను పంచుకుంటూ.. "ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండటం అసాధ్యం. చిన్నారి ఆర్నాకు నా ఆశీస్సులు, మద్దతు ఎప్పుడూ ఉంటాయి. ఆమె కలలు నిజం కావాలని కోరుకుంటున్నాను" అంటూ వ్యాఖ్యానించారు.
చిన్నారి ఐఏఎస్ ఆర్ణ వీడియో సోషల్ మీడియాలో వైరల్
— Bangalore TDP Forum (@BangaloreTDP) June 26, 2026
హీరో వెంకటేష్ సినిమాలో చెప్పిన డైలాగుల.. బ్యాక్ గ్రౌండ్‌తో ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆర్ణ తండ్రి
వైరల్ అయిన చిన్నారి ఆర్ణ వీడియోపై.. తన అఫీషియల్ ఇన్‌స్టా పేజీలో స్పందించిన సీఎం చంద్రబాబు
ఆర్ణ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరంటూ సరదా… pic.twitter.com/aanXhg13lz
ఇక చంద్రబాబు స్పందనపై ఆర్నా కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగంగా స్పందించారు. "థ్యాంక్యూ సార్... మీ ప్రోత్సాహం మాకు ఎంతో విలువైనది. మీరు ఎప్పటికీ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications