ఏపీలోనే ఆ జాతీయ పథకం ప్రారంభం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్!

ఏపీ ప్రభుత్వం కేంద్రంలో తమకు ఉన్న పవర్ ని అడుగడుగునా చూపిస్తూనే ఉంది. తాజాగా కేంద్రాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసే మరో కీలక పథకం వీ బీ జీ రామ్ జీ పథకం ఏపీ నుండే ప్రారంభించేలా ఏపీ సర్కార్ ఒప్పించింది. ముఖ్యంగా ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఏపీని ఎంచుకుని జాతీయ స్థాయి పథకాన్ని ఇక్కడే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

జాతీయస్థాయి పథకం ప్రారంభం ఏపీ నుండే

జులై 2న తిరుపతి జిల్లాలోని ముక్కావారిపల్లి గ్రామం ఈ గొప్ప కార్యక్రమానికి వేదిక అవుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్-గ్రామీణ్ అనే పూర్తిపేరుతో వీబీ జీ రామ్ జీ (VB-G RAM G) కొత్త పథకం గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల జీవనం మార్చేస్తుందని అంటున్నారు. గతంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)ను రద్దుచేసి దాని స్థానంలో ఇది తీసుకొచ్చారు.

Deputy CM Pawan Kalyan successfully convinced the Central Govt to launch the VB G Ram G scheme in ap

పథకం లాంచ్ కి హాజరయ్యే ప్రముఖులు వీరే

జులై నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న ఈ పథకం ఏపీలోనే మొదటి సారి జాతీయ స్థాయిలో లాంచ్ అవుతోంది. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరవుతారు. ఉదయం 11 గంటలకు ముక్కావారిపల్లిలో ఈ కార్యక్రమం జరగనుంది.

పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిని అంగీకరించిన కేంద్రం

పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో కేంద్ర మంత్రిని కలిసి ఈ పథకం ఏపీలోనే ప్రారంభించాలని మనవి చేశారు. ఆయన అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించి కేంద్రం అంగీకరించింది. దీంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, తిరుపతి జిల్లా అధికారులు స్థలాన్ని సందర్శించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వరకు చట్టబద్ధమైన వేతన ఉపాధి హామీ ఇవ్వనున్నారు.

ఈ పథకం లక్ష్యాలు ఇవే

ఈ పథకంతో వేతనాలు నేరుగా బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతాల్లో జమ చేసే వ్యవస్థ ఉంటుంది. జాబ్ కార్డు లేని వారు స్థానిక గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకోవచ్చు. గ్రామీణుల ఆదాయం పెంచడం, జీవనోపాధి భద్రత అందించడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, సమగ్ర అభివృద్ధి సాధించడం ఈ పథకం లక్ష్యాలు.

మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్!
మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్!

గతంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ఏపీలోనే ప్రారంభం

గతంలో 2006లో MGNREGA పథకం కూడా ఏపీలోని అనంతపురం జిల్లాలోనే ప్రారంభమైంది. ఇప్పుడు కొత్త పథకం కూడా ఏపీకి దక్కడం రాష్ట్రానికి గర్వకారణం. గ్రామీణ యువత, మహిళలు, కార్మికులు ఇందులో పాల్గొని లబ్ధి పొందాలని అధికారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమం ఏపీ గ్రామీణాభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+