జామా తండాలో కెసిఆర్ ఉగాది
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఉగాది పర్వదినాన్ని వరంగల్ జిల్లా జామాతండాలో జరుపుకున్నారు. తండా తండాలో గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా ఆయన రాత్రి అక్కడే బస చేశారు. సోమవారం ఉదయం ఆయన ఉగాది పర్వదినాన్ని ఆ తండాలో జరుపుకున్నారు. ఇంటింటికీ వెళ్లి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు. ప్రత్యేకంగా తయారు చేసిన బస్సులో ఆయన తన యాత్రను కొనసాగిస్తున్నారు.
వరంగల్ జిల్లా తొర్రూర్ లో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం చెన్నూరు మండలంలోని జామాతండాకు వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు రాజీనామా చేసిన స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్న పరిస్థితిలో ఆయన గిరిజనులు అధికంగా గల వరంగల్లు జిల్లా నుంచి తన యాత్రను ప్రారంభించారు. గిరిజనులను 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications