తెలంగాణపై అధ్యయనానికి టిడిపి కమిటీ

హైదరాబాద్: తెలంగాణపై అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో వేసింది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ఈ కమిటీని వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన టి. దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన యనమల రామకృష్ణుడు, కె. ఎర్రంనాయుడు, రాయలసీమకు చెందిన కె.ఇ. కృష్ణమూర్తి ఉంటారు. ఈ కమిటీ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుసుకుని తెలంగాణ ఆకాంక్షపై అభిప్రాయాలను సేకరిస్తుంది.

ధరల పెరుగుదలపై వామపక్షాలతో కూడి ఈ నెల 16వ తేదీ నుంచి ఆందోళనలు చేపట్టాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ విషయమై చంద్రబాబునాయుడు సిపిఐ కార్యదర్శి కె. నారాయణతో ఫోనులో మాట్లాడారు. అలాగే చంద్రబాబు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తారు. వారానికి మూడు రోజులు ఆయన జిల్లా పర్యటనలతో గడుపుతారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై చేపట్టాల్సిన ఆందోళనలపై యుఎన్ పిఎ నాయకులతో కూడా చంద్రబాబు మాట్లాడ్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+