వైభవంగా ఉగాది వేడుకలు
హైదరాబాద్: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ఉత్సవాలు సోమవారం వైభవంగా జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాలు రవీంద్రభారతిలో జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ఆర్థిక మంత్రి కె. రోశయ్యలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు పంచాంగ పఠనం చేశారు. అందరికీ సర్వధారి నామ సంవత్సరం మేలు చేస్తుందని పండితులు చెప్పారు. వర్షాలు బాగా కురుస్తాయని, వ్యవసాయం బాగుంటుందని, ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం అభివృద్దికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు.
ఈ నెల 9వ తేదీ నుంచి పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ప్రజలకు తాము ఎంతో చేశామని, అయినా సంతృప్తి కలగడం లేదని, ఇంకా చేయాలని ఉందని ఆయన చెప్పారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్ రావు ముఖ్యమంత్రిని సత్కరించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాదిని సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications