ఎసిబికి చిక్కిన పెద్ద చేప
హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని ఉప్పల్ ఆర్టీవోగా పనిచేస్తున్న విజయకుమార్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు బుధవారంనాడు దాడి చేశారు. హైదరాబాదులోని నారాయణగుడాలో గల ఆయన ఇంటిలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో ఎసిబి అధికారులకు పెద్ద యెత్తున ఆస్తులకు సంబంధించి పత్రాలు బయటపడ్డాయి. ఇంటిపై గల వాటర్ ట్యాంకులో విజయకుమార్ పడేసిన లక్షా 90 వేల రూపాయలను, బంగారాన్ని ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో విజయకుమార్ మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పని చేశారు. ఈ జిల్లాల్లో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. విజయకుమార్ కు చెందిన 40 ఎకరాల భూమి పత్రాలను వారు కనుక్కున్నారు. విజయకుమార్ ఇంట్లో విదేశీ మద్యం, కండోమ్ లు దర్శనమిచ్చాయి. డ్రైవింగ్ లైసెన్సులు కనిపించాయి. తన కుమారుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏజెంటుగా పనిచేస్తున్నాడని, ఇదంతా అతను సంపాదించిందేనని విజయకుమార్ అంటున్నాడు.












Click it and Unblock the Notifications
