ప్రేమించలేదని గొంతు కోసిన విద్యార్థి
విజయవాడ: విజయవాడ కృష్ణలంకలోని బాపనయ్యనగరులో ఇంజనీరింగ్ విద్యార్థిని మీనాకుమారిపై మరో ఇంజనీరింగ్ విద్యార్థి దాడి చేశాడు. సందీప్ అనే విద్యార్థి తనను ప్రేమించలేదంటూ మీనాకుమారిపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. దీంతో మీనాకుమారిపై తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రాణాపాయం లేదని ఇప్పుడే చెప్పలేమని వైద్యులు అంటున్నారు. సందీప్ మీనాకుమారి గొంతు కోసి తన మణికట్టు కోసుకున్నాడు. సందీప్ మీనాకుమారి ఇంటికి వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మీనాకుమారి తల్లిదండ్రులే ఎదుటే ఈ దారుణం జరిగింది.
మీనాకుమారి విజయవాడలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో సందీప్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. తనకు మీనాకుమారి నిరుడు జులై 4వ తేదీ నుంచి పరిచయమని నిందితుడు అంటున్నాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న వైద్య చికిత్స చేయిస్తున్నారు. రెండు నెలలుగా మీనాకుమారి తనతో మాట్లాడడం లేదని, మరో అబ్బాయితో సన్నిహితంగా మెలుగుతోందని, దాంతో మానసిక వేదనకు గురై ఈ దారుణానికి పాల్పడ్డానని సందీప్ చెబుతున్నాడు. సందీప్ మంగళవారంనాడు మీనాకుమారి ఇంటికి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అయితే తల్లిదండ్రులను తీసుకుని వస్తే మాట్లాడుతామని మీనాకుమారి తల్లిదండ్రులు అతనితో చెప్పారు. అయితే బుధవారం మళ్లీ వచ్చి మీనాకుమారిపై ఒత్తిడి తెచ్చాడు. ఆ తర్వాత అతను మీనాకుమారిపై హఠాత్తుగా దాడి చేసి గొంతు కోశాడు.












Click it and Unblock the Notifications
