బియ్యం పథకంలో అక్రమాలు సహించం: వైయస్

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలుకు ఏడాదికి 2 వేల కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుందని, అయినా తాము వెనకాడేది లేదని, ఈ పథకాన్ని నిరాటంకంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీవ్రమైన కరువు ఏర్పడితే తాము మహబూబ్ నగర్ జిల్లాలో గంజి కేంద్రాలు తెరిచామని, ఇప్పుడు జాతీయ హామీ పథకం ద్వారా పని కల్పించి కూలీ డబ్బులు సక్రమంగా అందే ఏర్పాటు చేశామని, పనికి ఆహార పథకం కింది బియ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పందికొక్కుల్లా మెక్కారని ఆయన అన్నారు. రుణాల మాఫీ పథకాలను ఆయన ఈ బహిరంగ సభలో ప్రస్తావించారు. అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు అందకపోతే తమకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
