మీనా గాయం పెద్దదే: వైద్యులు
విజయవాడ: ప్రియుడు సందీప్ గొంతు కోయడం వల్ల మీనాకుమారికి పెద్ద గాయమే అయిందని ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు అంటున్నారు. గొంతు కోయడం వల్ల మూడు లీటర్ల రక్తం పోయిందని, రక్తస్రావాన్ని ఆపగలిగామని వారు చెప్పారు. మీనాకు కొత్త రక్తం ఎక్కిస్తున్నామని వారు చెప్పారు. గాయం పొడవు 8 సెంటీ మీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు ఉందని వారంటున్నారు.
మీనా గాయం ప్రమాదకరమేనని వైద్యులు అంటున్నారు. మరో రెండు రోజులు అయితే గానీ ఏమీ చెప్పలేమని వారంటున్నారు. ముంబయి నుంచి తెచ్చిన కత్తితో సందీప్ తన కూతురు గొంతు కోశాడని మీనాకుమారి తల్లి అంజన చెప్పింది. అయితే సందీప్ వాడిన కత్తి మాయమైందనే మాట వినిపిస్తోంది. శ్రీలక్ష్మి హత్య కేసులో నిందితుడు మనోహర్ ను కఠినంగా శిక్షించి ఉంటే ఈ ఘాతుకం జరిగి ఉండేది కాదని విజయవాడ మేయర్ అంటున్నారు. నిందితుడు సందీప్ ను ప్రభుత్వానికి కాకుండా ప్రజలకు అప్పగించాలని ఆమె అంటున్నారు.












Click it and Unblock the Notifications
