మీనాకు శస్త్ర చికిత్స విజయవంతం
విజయవాడ: సీనియర్ విద్యార్థి సందీప్ దాడిలో తీవ్రంగా గాయపడిన మీనాకుమారికి వైద్యులు నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. తనను ప్రేమించడం లేదనే కోపంతో సందీప్ మీనాకుమారి గొంతు కోశాడు. సంఘటన గురించి తెలిసిన వెంటనే మీనా కుమారిని హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆమెకు అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించారు. మీనాకుమారి ప్రాణాపాయం నుంచి బయట పడిందని వైద్యులు చెప్పారు. మరో రెండు రోజుల పాటు ఆమె వైద్యుల పరిశీలనలో ఉంటుంది.
విజయవాడలోని బాపనయ్య నగరులోని అద్దె ఇంటిలో మీనాకుమారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. తండ్రి ఉద్యోగ రీత్యా విజయవాడలో ఉండడం లేదు. మీనాకుమారితో పాటు ఇద్దరు చెల్లెల్లు, తల్లి ఆ ఇంటిలో ఉంటున్నారు. బుధవారం ఉదయం సందీప్ ఇంటికి వచ్చి మీనాకుమారిపై దాడి చేశాడు. ఈ సంఘటనకు మీనాకుమారి చెల్లెలు షాక్ తింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మణికట్టు కోసుకున్న సందీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోనే పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. తనకేమీ తెలియదని, తననేమీ అడగవద్దని సందీప్ మీడియా ప్రతినిధులతో అంటున్నాడు.












Click it and Unblock the Notifications
