మంచం మీద పడేసి గొంతు కోశాడు
విజయవాడ: ఇంజనీరింగ్ విద్యార్థి సందీప్ తాను ప్రేమించిన మీనాకుమారిని మంచం మీద పడేసి ఆమె గొంతు కోశాడు. పక్కింటి యువకుడు అడ్డుకోవడానికి వస్తే అతన్ని కత్తి చూపించి చంపేస్తానని బెదిరించి మరీ ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకం మీనాకుమారి ఇంటిలోనే జరిగింది. మీనాకుమారి తల్లి ఎదుటే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మీనాకుమారి తనను మోసం చేసిందని, అందుకే ఆమెను చంపి తాను చచ్చిపోతానని సందీప్ అన్నాడు.
పెళ్లి చేయకపోతే తన కొడుకు ఏమైనా చేసుకుంటాడని సందీప్ తల్లి తనతో ఫోనులో అన్నదని మీనాకుమారి తల్లి చెబుతోంది. ఇంటికి వస్తే మాట్లాడుదామని తాను చెప్పినట్లు ఆమె తెలిపింది. తాను మీనాకుమారిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పినా వినకుండా సందీప్ దాడి చేశాడని ఆమె అంటోంది. సందీప్ మణికట్టు గాయానికి వైద్యులు చికిత్స చేశారు. అతన్ని జనరల్ వార్డుకి తరలించారు.












Click it and Unblock the Notifications
