అందోళనకరంగా ద్రవ్యోల్బణం పెరుగుదల
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం ఈసారి 41 నెలల గరిష్ట స్థాయిని తాకింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని అదుపు చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా మార్చి 29తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం అంతకుముందు వారాంతం కంటే ఎక్కవగా పెరిగింది. ఇది ఏడు శాతంగా నమోదైంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలు ఆర్థిక సంస్కరణలను దెబ్బతీస్తాయని ప్రధానమంత్రి హెచ్చరించారు.
పళ్లు, కూరగాయాలు, ఇతర ఆహార పదార్థాలు, కొన్ని వినిమయ వస్తువుల ధరల పెరుగుదల ఈసారి ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణమయింది. ఇంతకుముందు ఏడాది ఇదే వారాంతానికి ద్రవ్యోల్బణం 5.94 వద్ద ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒత్తిడిని తట్టుకునేందుకు రిజర్వు బ్యాంకు తన వార్షిక క్రెడిట్ పాలసీలో కఠిన ద్రవ్య విధానాలను ప్రకటించే అవకాశాలున్నాయి. ఆర్‌బీఐ వార్షిక క్రెడిట్ పాలసీని ఈ నెల 29న ప్రకటించనుంది.












Click it and Unblock the Notifications
