బలరాం వ్యాఖ్యలపై విచారణ వాయిదా

Suresh Reddy
హైదరాబాద్: స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై తెలుగుదేశం శాసనసభ్యుడు కరణం బలరాం చేసిన వ్యాఖ్యలపై సభా హక్కుల సంఘం శుక్రవారం సమావేశమైంది. స్పీకరుపై కరణం బలరాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై శాసనసభా హక్కుల సంఘం విచారణ ప్రారంభించింది. కరణం బలరాంపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సియల్పీ) స్పీకరుకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణను సంఘం ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
బలరాం వ్యాఖ్యలు హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయా, రావా అనేది సభా హక్కుల సంఘం తేల్చలేకపోయింది. బలరాంపై వచ్చిన ఆరోపణల మీద మీడియా కథనాలు తప్ప మరే ఆధారాలు లేవు. మీడియా కథనాలు, క్లిప్పింగుల ఆధారంగా కరణం బలరాంపై చర్యలు తీసుకోవడానికి వీలుంటుందా, లేదా అనే విషయంపై సభా హక్కుల సంఘం ఆలోచిస్తోంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+