తెల్లకార్డు ఆదాయ పరిమితి పెంచే యోచన: వైఎస్

రూ. 2కు కిలో బియ్యం పథకం అమలు తీరు తెన్నులపై అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పంధించారు. రాష్ట్రంలోని బోగస్ కార్డులను ఏరివేసే విషయమై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న గరిష్ట ఆదాయ పరిమితిని రూ. 36 వేలకు పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.
అందువల్ల ప్రస్తుత గరిష్ట ఆదాయ పరిమితి రూ. 24 వేలకంటే ఎక్కువ ఉన్న వారికి కూడా తెల్లకార్డులు జారీ చేయనున్నామని ఆయన తెలిపారు. తెల్లకార్డులు కలిగిన కొందరు బియ్యాన్ని తీసుకోకపోవడం వల్ల ఆ బియ్యాన్ని డీలర్లు అమ్ముకుంటున్నారన్న ప్రశ్నకు ఆయన స్పంధిస్తూ అలాంటి విషయాలు తమ దృష్టికి రాలేదన్నారు. అయితే అక్రమంగా కార్డులు కలిగిన డీలర్లను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
