అమర్ అనుచరుల అరెస్టు?
హైదరాబాద్: సిపిఐ (ఎంఎల్) జనశక్తి కేంద్ర కమిటీ తాత్కాలిక కార్యదర్శి కూర దేవేందర్ అలియాస్ అమర్ అనుచరులను ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం లింగయ్య అనే వ్యక్తిని పోలీసులు తక్కెళ్లపల్లిలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతను ఇచ్చిన సమాచారం మేరకు మల్లయ్య అలియాస్ మల్లేష్ అనే వ్యక్తిని హైదరాబాదు సమీపంలోని ఎల్బీ నగరు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారినుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అమర్ నుంచి కూడా పోలీసులు కీలకమైన సమాచారాన్ని రాబట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పూణేలో అరెస్టయిన ప్రస్తుతం అమర్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. అతన్ని తమ కస్టడీకి తీసుకుని పార్టీ డంప్ లకు సంబంధించిన సమాచారం రాబట్టాలని పోలీసులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
