మాల, మాదిగల ఘర్షణ: లాఠీచార్జీ
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాదులోని ట్యాంకుబండు వద్ద మాల, మాదిగలకు మధ్య ఘర్షణ చెలరేగింది. అంబేడ్కరుకు నివాళులర్పించిన అనంతరం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ ప్రసంగించడం మొదలు పెట్టారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి మాలలు ప్రయత్నించారు. దీంతో మాల, మాదిగల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి, కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఈ నెల 21వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడ్తామని మందకృష్ణ మాదిగ చెప్పారు. ట్యాంకుబండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, సిపియం నాయకుడు బి.వి. రాఘవులు, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications
