తెలంగాణపై అడుగొద్దు: డిఎస్ అసహనం
{image-d srinivas_14042008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: తెలంగాణపై పదే పదే అడగవద్దని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల వద్ద అసహనం ప్రదర్శించారు. తెలంగాణ విషయంలో తాను చెప్పాల్సిందేమీ లేదని ఆయన సోమవారంనాడు అన్నారు. తెలంగాణ విషయంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు.
యుపిఎ ప్రభుత్వం సందర్భం వచ్చినప్పుడు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. సమస్య పరిష్కారం కోసం తీవ్రంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించడం తప్పా అని ఆయన అడిగారు. తెలంగాణపై తానొకటి మాట్లాడితే మీడియా ప్రతినిధులు మరోటి రాస్తారని, తద్వారా మీడియా ప్రతినిధులు అగ్నికి ఆజ్యం పోస్తారని ఆయన అన్నారు. డి. శ్రీనివాస్ సోమవారంనాడు దివంగత కాంగ్రెస్ నేత పి. జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిశారు. జనార్దన్ రెడ్డి తనకు మంచి మిత్రుడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
