భద్రాచలం: మరికొద్ది సేపట్లో సీతారాముల కళ్యాణం జరుగనుంది. వైకుంఠ రాముని కళ్యాణాన్ని కనులారా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.భక్తుల రామనామ స్మరణతో గోదావరి తీరం పులకరిస్తోంది.
దూరదర్శన్, ప్రైవేటు చానళ్ళలో కళ్యాణం ప్రత్యక్ష ప్రసారమవుతోంది. ఆదివారం రాత్రి ఇక్కడ ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. స్వర్ణ ఊంజలి సేవను మంత్రి రత్నాకరరావు ప్రారంభించారు