రాఘవులతో డిఎస్ గంటన్నర చర్చలు
{image-d srinivas_14042008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సోమవారం ఉదయం సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులును కలుసుకున్నారు. కాంగ్రెస్ ఫ్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న స్థితిలో సిపియం కార్యాలయానికి వెళ్లి ఆయన రాఘవులును కలుసుకోవడం విశేషమే. అయితే తాను రాఘవులును మర్యాదపూర్వకంగానే కలుసుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. అంబేడ్కర్ కు నివాళులు అర్పించిన అనంతరం ఆయన సిపియం కార్యాలయానికి వెళ్లారు. దాదాపు గంటన్నర సేపు ఇరువురు నేతల మధ్య భేటీ నడిచింది.
గత ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని, ఆ స్నేహం దృష్ట్యానే తాను రాఘవులును కలిశానని ఆయన చెప్పారు. ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు పొత్తులు ఖరారవుతాయని, అప్పటి పరిస్థితులను బట్టి కొన్ని శక్తులను దూరం పెట్టడానికి పొత్తులు ఏర్పడతాయని ఆయన అన్నారు. అభిప్రాయభేదాలు ఎప్పుడూ ఉంటాయని, కేంద్రంలో వామపక్షాలు తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. తాము ఇద్దరం స్నేహితులం కలిశామని రాఘవులు అన్నారు. రాజకీయాలు చర్చించామని, శ్రీనివాస్ రాజకీయాలు శ్రీనివాస్ చెప్పారని, తమ రాజకీయాలను తాను చెప్పామని ఆయన అన్నారు. రాజకీయాలు రాజకీయాలుగానే ఉంటాయని, తమ వ్యక్తిగత స్నేహం కొనసాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
