రామోజీపై ఉండవల్లి మరోసారి ధ్వజం

Ramoji Rao
న్యూఢిల్లీ: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి ధ్వజమెత్తారు. ఈనాడు ద్వారా ముందడుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రామోజీ రావు పత్రికలో ప్రకటించిన నేపథ్యంలో ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శలకు దిగారు. మార్గదర్శి బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలని తాను అడిగితే నిరాకరించిన రామోజీరావు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనర్హులని ఆయన అన్నారు. ముందు మార్గదర్శి విషయాలను రామోజీరావు వెల్లడించాలని ఆయన అన్నారు. 31 మార్చి 2006 నాటికి 1800 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న రామోజీ సంస్థలు 31 మార్చి 2007నాటికి 500 కోట్ల రూపాయల లాభాల్లోకి ఎలా వచ్చాయని ఆయన అడిగారు. తాను మార్గదర్శి విషయాలని బయటపెట్టిన నేపథ్యంలో ఖాతాదారులు ఆందోళన చెందారని, ఈ స్థితిలో వారిని ఆందోళన నుంచి బయట పడేయడానికి లాభాల్లోకి వచ్చినట్లు ప్రకటించారా, లేకుంటే ఆదాయం పన్ను ఎగవేయడానికి నష్టాలు వచ్చినట్లు చూపారా అని ఆయన అడిగారు.

మార్గదర్శి విషయాలపై తాను వేసిన ప్రశ్నలకు రామోజీ రావు సమాధానం ఇవ్వాలని, తనపై రామోజీ చేసిన ఆరోపణలకు తాను సమాధానాలు ఇస్తానని, తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే క్షమాపణ చెప్తానని ఆయన అన్నారు. మిగతా వ్యక్తుల జీవితాల్లోకి ప్రవేశించే హక్కు రామోజీకి ఎలా వచ్చిందని ఆయన అడిగారు. ఇతరుల జీవితాల్లోకి ప్రవేశించడానికి తనకు హక్కు ఉందనుకుంటున్న రామోజీరావు తాను ఆదాయం పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు మీడియాను ఫొటోలు తీసుకోకుండా ఎందుకు అడ్డుకున్నారని ఆయన అడిగారు. తెలుగుదేశం అధికారిక పత్రిక సంపాదకుడిగా, వ్యాపారవేత్తగా మార్గదర్శి వివరాలను ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం, కేంద్రంలో దేవెగౌడ ప్రభుత్వం ఉన్న కాలంలో చట్టవ్యతిరేకంగా విగ్రహాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు రామోజీరావు చిక్కారని, ఆ వార్తను రామోజీ ఈనాడులో ఎందుకు ప్రచురించలేదని ఆయన అన్నారు. రామోజీరావు అపరాధ భావనకు గురయ్యారని ఆయన అన్నారు. ఈనాడులో, ఈటీవీలో ఇతరుల విషయాలను వక్రీకరించి రాస్తారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+