వైయస్ పై వెంకయ్య మండిపాటు

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని పార్టీ పరంగా, పార్టీ నాయకుల చేత మొదలు పెట్టించిన ముఖ్యమంత్రి పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన అంతరాన్ని కాలరాశారని ఆయన విమర్శించారు. ఇప్పుడు విమర్శలు వచ్చే సరికి ప్రతిపక్షాలను కలిసి రావాలని అంటున్నారని ఆయన అన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని రాజకీయం చేయడం వల్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఈ పథకం అమలు కోసం అఖిల పక్ష కమిటీలను వేసి ప్రతిపక్షాల ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
