మళ్లీ గెలుస్తాం: వైయస్ ధీమా
ఖమ్మం: తాము తిరిగి అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అడిగినంత కాలం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం కొనసాగుతుందని ఆయన అన్నారు. సీతారాముల కళ్యాణం అనంతరం ఆయన సోమవారం భద్రాచలంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దుమ్ముగూడెం ప్రాజెక్టుకు అవసరమైనన్ని నిధులు అందిస్తామని ఆయన చెప్పారు. భద్రాచలంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అమలవుతుందని ఆయన అన్నారు. గిరిజన, గిరిజనేతర సమస్యకు సామరస్య పరిష్కారం సాధ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
జలయజ్ఞం పూర్తయితే ఖమ్మం జిల్లాలో సాగుయోగ్యమైన భూమిలో 98 శాతం భూములకు నీరందతుందని ఆయన చెప్పారు. సాగు నీరు అందే జిల్లాల్లో ఖమ్మం జిల్లానే మొదటి స్థానంలో ఉంటుందని ఆయన చెప్పారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కూరగాయల ధరలపై కూడా ఆయన మాట్లాడారు.












Click it and Unblock the Notifications
