చిరు వర్సెస్ బాలయ్య తప్పు: హరికృష్ణ

తెలుగుదేశం పార్టీ కోసం నందమూరి వంశం పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఎన్టీ రామారావు మనవళ్లు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తారని ఆయన చెప్పారు. తన సోదరి పురంధరేశ్వరి వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన చెప్పారు. తమ సోదరి పురంధరేశ్వరిని ఒక అయ్య (దగ్గుబాటి వెంకటేశ్వరరావు) చేతిలో పెట్టామని, ఆమె ఆ అయ్య చెప్పినట్లు వినాల్సిందేనని ఆయన అన్నారు. ఎన్టీ రామారావును కాంగ్రెస్ పార్టీ ఎలా ఇబ్బందులకు గురి చేసిందో అందరికీ తెలుసునని, కాంగ్రెసును ఎన్టీరామారావు తరిమి కొట్టారని, ఎన్టీ రామారావు రక్తాన్ని పంచుకుని పుట్టామని, అందువల్ల ఎన్టీ రామారావు ఆశయాల సాధనకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
