ధరలపై అట్టుడికిన పార్లమెంటు

న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై మంగళవారం పార్లమెంటు ఉభయసభలు అట్టుడికాయి. ప్రతిపక్ష పార్టీలతో పాటు యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వామపక్షాలు ధరల పెరుగుదలపై పార్లమెంటు ఉభయ సభల్లోను ఆందోళనకు దిగాయి. దీంతో పార్లమెంటు ఉభయ సభలు అర్థాంతరంగా రేపటికి వాయిదా పడ్డాయి. ధరల పెరుగుదలపై చర్చకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ బిజెపి, వామపక్షాలు సభ్యులు, ఇతర ప్రతిపక్షాల సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి.

కొత్త మంత్రులను సభకు పరిచయం చేయగానే లోకసభలో ప్రతిపక్షాలు ధరల పెరుగుదల అంశాన్ని లేవనెత్తాయి. అలాగే, కొత్త రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగానే రాజ్యసభలో ధరల పెరుగుదల అంశం ప్రస్తావనకు వచ్చింది. ధరల పెరుగుదలను నిరసిస్తూ సమాజ్ వాది పార్టీ సభ్యులు, బిజెపి సభ్యులు కొంత మంది లోకసభ వెల్ లోకి దూసుకెళ్లారు. ధరల పెరుగుదల మాత్రమే ఇప్పటి అంశమని లోకసభలో బిజెపి సీనియర్ సభ్యుడు మురళీ మనోహర్ జోషీ అన్నారు. సభలు వాయిదా పడిన తర్వాత వామపక్షాల సభ్యులు, యుఎన్ పిఎ సభ్యులు పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+