నాన్నను చంపిన నళినిని కలిశా: ప్రియాంక

తన తండ్రి హంతకులను కలుసుకోవడానికి తాను వెల్లూరు వెళ్లానని ఆమె చెప్పారు. నళినిని తాను మార్చి 19వ తేదీన కలుసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇరువురి మధ్య సమావేశాన్ని నళిని తల్లి కూడా ధృవీకరించింది. వీరి మధ్య సమావేశం సామరస్యపూర్వకంగా సాగిందని ఆమె చెప్పింది. రాజీవ్ గాంధీని 1991 మే 21వ తేదీన శ్రీపెరంబుదూరులో ఆత్మాహుతి దళ సభ్యులు హత్య చేశారు. రాజీవ్ హంతకుల్లో బతికి ఉన్న ఒకే ఒక వ్యక్తి నళినికి కోర్టు మరణశిక్ష వేసింది. అయితే రాజీవ్ గాంధీ సతీమణి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జోక్యం చేసుకోవడంతో నళినికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు.












Click it and Unblock the Notifications
