రాహుల్ ఫ్లాప్: వెంకయ్యనాయుడు

రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏదో జరుగుతుందని కొంత మంది అంటున్నారని, ఏం ఒనగూరుతుందనేది తనకు ఏ మాత్రం అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తన తల్లి సోనియా గాంధీ మాదిరిగానే రాహుల్ గాంధీ కూడా విఫలమయ్యారని, మొదట ఉత్తరప్రదేశ్ లో ఆ తర్వాత గుజరాత్ లో రాహుల్ ఫ్లాప్ అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ లో తల్లీకొడుకులిద్దరూ విఫలమయ్యారని ఆయన అన్నారు. గత నాలుగేళ్లలో 12 రాష్ట్రాలకు ఎన్నికలకు జరిగితే పది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ఆయన చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications
