గొంతు కోసుకున్న ప్రేమికుడు

విజయవాడ: ప్రేమించిన యువతి కోసం ఒక యువకుడు గొంతు కోసుకున్నాడు. ప్రియుడు ప్రియురాలు మీనా కుమారి గొంతు కోసిన సంఘటన జరిగిన విజయవాడలోనే ఈ సంఘటన కూడా జరగడం విశేషం. విజయవాడలోని బెంజీ సర్కిల్ లో గల సత్యనారాయణ నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కరుణాకర్ అనే యువకుడు తాను మెచ్చిన యువతి వద్ద తన ఇష్టాన్ని వెల్లడించాడు. తమ తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆ యువతి కరుణాకర్ కు సూచించింది.

కరుణాకర్ సోమవారం రాత్రి ఆ యువతి ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో ఆ యువతి సోదరుడు కరుణార్ తో గొడవ పడ్డాడు. దీన్ని అవమానంగా భావించిన కరుణాకర్ తన గొంతు కోసుకున్నాడు. చేతులకు గాయాలు చేసుకున్నాడు. ఈ సంఘటనను చూసిన స్థానికుల చొరవతో కరుణాకర్ ను ఆస్పత్రిలో చేర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+