అధికారులపై వైయస్ మండిపాటు

YS Rajasekhar Reddy
విజయనగరం: జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీలకు తక్కువ చెల్లించడంపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా తెర్లాం శాసనసభా నియోజక వర్గంలోని లోచర్లలో ఆయన మంగళవారం ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రజలను ప్రశ్నించారు. తమకు రోజుకు 20, 30 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని కూలీలు చెప్పడంతో విస్తుపోయిన ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ ఎందుకు చెల్లిస్తున్నారని అడిగారు. తక్కువ కూలీకి ఎక్కువ మంది పని చేయడానికి ముందుకు వచ్చారని వారు చెప్పారు. పనిని బట్టి కూలీల సంఖ్యను నిర్ణయించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గంలో విద్యుత్ లోవోల్టేజీ సమస్యపై ప్రజలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి విద్యుచ్ఛక్తి అధికారులపై మండిపడ్డారు. వారంలోగా లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. సాగునీటికి ఎంత ఖర్చయినా పెడతామని ఆయన చెప్పారు. తెర్లాం శాసనసభా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడి నుంచి ఆయన తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు బయలు దేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+