వడదొరా ప్రమాదంలో 44 మంది మృతి
వడోదరా: గుజరాత్ రాష్ట్రంలోని వడదొర వద్ద బుధవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులున్నారు. వడోదరా జిల్లాలోని బొదెలీ గ్రామం వద్ద ఈరోజు ఉదయం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ప్రమాదవశాత్తూ నర్మాదా కాలువలో పడిపోయింది. దీంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
60 అడుగుల లోతు ఉన్న ఈ కాలువలో 44 మృతదేహాలను బయటకు తీశామని జిల్లా డీఎస్‌పీ అమిత్ విశ్వకర్మ తెలిపారు. నలుగురు విద్యార్థులను ప్రాణాలతో రక్షించగలిగామని జిల్లా కలెక్టర్ విజయ్ నెహ్రా వెల్లడించారు. తార్గోల్ నుంచి బొలెలీకి వంతెన మీది నుంచి వెళుతుండగా ఈ బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. బుధవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు.












Click it and Unblock the Notifications